బ్లాగ్స్ రాయడం

బ్లాగ్గింగ్ చేయడం అంత కష్టమైన పని ఏమి కాదు. కావలసింది/చేయవలసింది ఇవి:
౧. సహనం
౨. ఆలోచన
౩. నెమ్మది

౧. సహనం: ఇలా పని లేని పనుల గురించి రాయాలి అంటే కొంచెం సహనం అవసరమే. మన దైనందిన జీవితం లో చేసే/చెయ్యవలసిన పనులతో పోల్చి చూస్తే ఈ పని అవసరమా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ఇలా తెలుగులో వ్రాయడం కొంచెం కష్టమే. కాని కేవలం నాకు నా మాత్రు భాష ఐన 'తెలుగు' మీద ఉన్నా మమకారం తో నేను ఈ పని చేస్తున్నాను.

౨. ఆలోచన: ఈ మాత్రం రాయడానికే నేను ఒక గంట ఆలోచించి రాసాను. ఇంక అస్సలు విషయాలు గురించి రాయడమంటే కొంచెం ముందు చూపు అవసరం. ఒక పని చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలి అని ముందే ఆలోచించి పెట్టుకుంటే ఆ పని చేసేటప్పుడు చాలా నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది. అలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ పని చెయ్యటం మొదలు పెట్టడం కష్టం అవుతూ ఉంటుంది.

౩. నెమ్మది: బ్లాగ్గింగ్ చెయ్యడం అనేది ఒక పాతిక గుంజీలు తీయడం లాంటిది కాదు. అలా అని ఇది ఒక తపస్సు అనట్లేదు. మన నిజ జీవితం లో జరిగే విషయాల సమాహారం నుంచి ప్రపంచం లో జరిగే రాజకీయాల వరకు మన ఓపిక ఉన్నవిషయం మీద బ్లాగ్గింగ్ చెయ్యొచ్చు. అలా అని ఇష్టం ఉన్నరీతిలో రాయడం మంచిది కాదు. చాల జాగ్రత్తగా ఆలోచించి, మంచి మంచి మాటలతో వ్రాస్తే చదివే వాళ్ళకి నచ్చుతుంది.

నాకు ఇంకా ఇది(తెలుగులో వ్రాయడం) అలవాటు అవ్వలేదు. మొదట్లో కొంచెం కష్టమే ఐనా నేను మానవ ప్రయత్నం చేస్తూ ఉంటాను.

ఇంకా మంచి ఆర్టికల్స్ వస్తాయి. మరి మీరు ఓపిక పడతారు అని ఆశిస్తూ...

సెలవు మరి,
-శ్యాము

1 comment:

rākeśvara said...

బ్లాగ్లోకానికి స్వాగతం రెడ్డి గారు,
చాలా సంతోషం ఇక్కడ చేరినందుకు.
మీరు వెంటనే మీ బ్లాగు లంకెని తెలుగు బ్లాగర్ల గుంపుకు పంపండి.
telugublog@googlegroups.com
ఆ తరువాత మీ బ్లాగు టపాలు కూడలి , జల్లెడ వంటి పలుచోట్ల లంకించబడతాయి ఆ తరువాత పాఠకులే పాఠకులు :)

ఇక బ్లాగు వ్రాయడాన్ని అంత సీరియస్ గా తీసుకోనక్కరలేదు. ఏ సొల్లైనా వ్రాయవచ్చు.
కానీ మీ బ్లాగ్దిగ్విజయానికై కొన్ని సూచనలు ఇక్కడ చూడండి ;)

ఇక తెలుగులో టైపడం ముందు ముందు చాలా తేలికైపోతుంది.

మీ గూగులు ప్రకటనలను, టపా నుండి తొలగించి, వాటిని పక్కపట్టీలో చేర్చండి. ఇప్పుడ టపాలు చదవడానికి కొంత ఇబ్బందిగా వుంది.