స్నేహితులు - ౧

చిన్నపట్నుంచి నా జీవితంలోకి చాలా మంది స్నేహితులు వచ్చారు వెళ్లారు. అప్పుడప్పుడు ఈ స్నేహాల గురించి గుర్తుకు వచినప్పుడల్లా అనిపిస్తుంది, "అసలు వీళ్ళతో నేను ఎందుకు స్నేహం చేశానా అని?". కొన్నిటికి కారణం నేను అని అనిపించినా, వాళ్ళని కూడా తిట్టుకునేవాడిని.

ఇప్పటిదాకా ఉన్న, మర్చిపోయిన, మరచిపోలేని స్నేహితులని గమనిస్తే నాకు ఒకటే అనిపిస్తుంది. నా స్నేహాలు వాళ్ల దగ్గర నా ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని.

మన స్నేహితులని, మంచి స్నేహాలని కాపాడుకోవడానికి నా జీవితం నుంచి నేను ఏరికోరిన, సూత్రాల గురించి రాస్తూ ఉంటాను. అలాగే నాకు కొన్ని సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో మొదటిది:

౧. వాళ్లు ఏ పరిస్తుతుల్లో ఉన్నారో మరి: మామూలుగా మన స్నేహితులని కలవడానికి వెళ్ళినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని కలిసింది నిన్న అయినా కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్టు ఉంటుంది. (లేదంటే మనం ఎందుకు వెళ్తాం చెప్పండి?) సరే వెళ్ళాం. కలిసాం. మరి వాళ్ళకి ఆ క్షణం, ఆ గంట, ఆ రోజు, ఆ వారం, ఆ సందర్భం లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు. వాళ్లు చెప్తే సరే సరి. లేక పోతే?

ఇలాంటప్పుడు మీరు ఎం చేస్తారు

కింద కామెంట్స్ లో రాయండి.

ఇక ఉంటాను,

- శ్యాము

No comments: